Wednesday, May 10, 2023

మారని వ్యూహం తేది : 15-11-2022 శీర్షిక : మార్పు మనతోనే ...

 మారని వ్యూహం 

తేది : 15-11-2022
శీర్షిక : మార్పు మనతోనే ... 
కవిత సంఖ్య : సహస్రాధికం 

వజ్రోత్సవాల వాకిట సంబరాల 
మునిగినా ....తీరు మారని తిప్పలే ... 
రాజకీయ రాబడుల మతలబులే 
రాజ్యమేలుతున్న ముచ్చటలు గొప్పలై ...

కుంటుపడిందనుకున్న రాజరికం 
కుటుంబాల వశమై దేశమంతా 
విస్తరించి దోషపూరితమై చరిస్తూ .. 
కొల్లగొడుతున్న దాఖలాలే ....  

పదులలో పదిలమైన లంచగొండితనం  
విచ్చలవిడిగ లక్షల కోట్ల రేట్లతో పోటీ...  
చాటుమాటు బంధుప్రీతి కాస్తా...నిర్లజ్జగా   
బాహాటంగా జూలు విదిల్చుకుంది ... 

ప్రాదేశికాలన్నీ నిజ సామంతమయి 
నిధులు కొల్లగొడుతూ డొల్ల బారుస్తూ 
పర్యావరణాలతో పరాచికాలాడుతూ 
గంభీర ప్రవచనాలిస్తున్నాయి .... 

సుక్కకు సూదంటురాయిలై ... 
ముక్కను మురికిచూసే విశ్వాసమైతే ... 
నక్కకు ... నాగలోకానికి ఉన్న తేడా 
నిక్కముగా మనకు దక్కని ఊసే .... 
మార్పు మనతోనే మొదలవ్వాలి ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment