ఎత్తవోయి జండా
ఎగురవేయి జండా
మనసంతా నిండగా
మమతలే పండగా
ఎన్టీపీసి పేరువింటే
ఎదనిండా వెల్లివిరియు
అమ్మ ఒడి తీరుగానే
అనుభవాల తీపిగుర్తు
రత్న కాంతులు రంజిల్లు
దేశమంతా వెదజల్లు
పల్లె పల్లె పల్లవించి
ప్రజలందరినీ మురిపించు
మాతృమూర్తిగా దీవించు
సమతామూర్తిగా ప్రభవించు ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment