కవన రవళి
గజల్
13-11-22
శిశిరంలో
తలలుదులుప
వాలుతుంది కనకతార
తరువులన్ని బోసిపోగా
కుంగుతుంది కనకతార...
మంచిరోజు వచ్చుననీ
మారాజుగ బతుకేనని
ఆశలతో పల్లవించి
కదులుతుంది కనకతార...
వసంతమున చివుళ్ళతో
ఆహ్వానము పలకగనే
వనమాలిగ తోటంతా
ఎగురుతుంది కనకతార...
ఆనందము వెల్లివిరియ
చిందేసీ గంతులేస్తు
తనువంతా పులకరించి
పాడుతుంది కనకతార...
మయూరాల నటనలతో
హృదయమంతా ఉల్లాసాల
ఉప్పొంగిన రాజసాల
ఆడుతుంది కనకతార...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment