కళాశ్రీ -
అంశం : ధర్మం వీడకు
తేది : 07-11-2022
శీర్షిక : పాటించే స్థితప్రజ్ఞత…
కవిత సంఖ్య : 181+2
ధర్మానికి నీవు కాపలా కాస్తే
ధర్మం నీ దాపునే నిలుస్తుంది ...
పరిస్థితుల ప్రకారం మార్పు చెందేది ...
మార్పు చెందే ధర్మాన్ని మారని స్థితప్రజ్ఞతతో
ఆచరించడమే ... మారనిదొక్కటే సత్యం ...
శాంతి సహనం సత్యం అహింసా
ఉపకారం సానుభూతి ఓర్పు సేవ
ఆదిగాగల అన్నీ ఆ మహావృక్షంలోని
కొమ్మలు రెమ్మలు ఉపాంగాలే ....
యుగాలెన్నో గడిచినా జగాన
నేటికీ తేజమే రామరాజ్యపాలన ...
మాటల్లో నిర్వచనాలిచ్చినంత
సులభము కాదు...అలా అని అత్యంత
దుర్లభము కాదు ...
ఆచరించిన ధర్మరాజుకు లా
తాత్కాలిక సమస్యనిపించినా ...
శాశ్వత విజయ సంపదల్నిస్తుంది ...
పేరు ప్రతిష్టల ప్రఖ్యాతుల పెన్నిధి.
విశ్వమెంత విపరీతాలకు పోయినా ...
అహం ఎన్ని అగచాట్లను తెచ్చిపెట్టుకున్నా
చివరకు అందరు ధర్మం నీడలో సేద
దీరాల్సినదే .... ముందు ... వెనుకా ....
ధర్మమెరుగుట మాత్రమే... కన్నా
ధర్మం అనుష్టించడమే ధర్మాత్మం ...
ధర్మం తెలిసిన రావణుని కన్నా
ధర్మం ఆచరించిన రాముడే
ఆచంద్ర తారార్కం చిరంజీవుడాయే ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment