కణిక -అంశం : హృదయ రాగం
తేది : 04-11-2022
శీర్షిక : మనన మంత్రం
మినీ కవిత
అనురాగాల అమృతమూర్తి అమ్మైనా
అభయ గంభీర వాక్కుల నాన్నైనా
మమతల పందిరి మాతృదేశమైనా
అప్రకటిత రహస్యాల నెలవు మిత్రుడైనా
మననక్షణాన మనసు పరిమళమై ..
కనిన క్షణాన కనులు వర్షించి...
తనువు పులకరింపుల తన్మయమై...
హృదయ కమలం విప్పారడమే ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment