Wednesday, May 10, 2023

అంశం : కార్తీకమాసం ఓ కోయిలమ్మ - 2

 అంశం : కార్తీకమాసం 

నిర్వహణ : గుడిపూడి సావిత్రిప్రసాద్ 
ఓ కోయిలమ్మ - 2 

అంబరాన తారలు 
అవనిపైన దీపాలు 
విశ్వమంత వెలుగులు 
ఓ కోయిలమ్మ !

తరిగిన పగలు 
పెరిగిన నిశివేళ  
విరిసిన మంచు 
ఓ కోయిలమ్మ !

శుచి శుభ్రతలు 
మడి ఆచారాలు 
అంతిమాన ఆరోగ్యం 
ఓ కోయిలమ్మ ! 

సెలయేటి స్నానం
ఉసిరిదీప దానాలు  
ఉపవాస దీక్షలు 
ఓ కోయిలమ్మ ! 

ఉల్లములు మెరియ 
ఉసిరి స్నానాలు 
ఉపవాస వ్రతం 
ఓ కోయిలమ్మ !

ముక్కంటి పూజలు 
మురిపాన కార్తీకం 
ముదితమే హైందవం 
ఓ కోయిలమ్మ ! 

పారేటి నీటితో 
పాపాలు కడిగేయి 
పౌర్ణమి రోజున 
ఓ కోయిలమ్మ ! 

పెద్దల సుద్దులు 
విజ్ఞుల శాస్త్రాలు 
ఆరోగ్యం ఆధ్యాత్మికం 
ఓ కోయిలమ్మ ! 

మకుటమైన మాసం 
కృతిక కార్తీకం 
సత్యవ్రత ప్రశస్తం 
ఓ కోయిలమ్మ ! 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment