అంశం : భక్తి
తేది 15-11-2022
శీర్షిక : నవివిధ భక్తి
పుట్టి బుద్దెరిగిన నాటినుండి
నిత్యం పోరాటమే .. ఆరాటమే ...
ఎప్పటికప్పుడు ఎదురయ్యే సమస్యలతో
జీవన సమరంలో మునిగిపోయి...
పుట్టింది ఎందుకో తెలుసుకోలేక
పుట్టించిన భగవంతునికి కూడా
దూరం జరుగుతూ .. జరుగుతూ ...
లక్ష్యం మరిచిపోయి కక్ష్యగా తిరుగుతూ...
ఏది ఏమైనా ... విజ్ఞానం .. వివేకం ..
వివేచనం ఉన్న మనిషి పాటించాల్సిన
నిజ భక్తి సాగరమిలా .....
నవవిధ భక్తి సూత్రం నిజ భక్తి
సాగరం ....అందునా ప్రథమమే
దైవలీలల శ్రవణం ... ఆనక ద్వితీయం
ఆనంద కీర్తనం ... తదుపరి తృతీయం
తాదాత్మ్య స్మరణం ...
చరితార్థమే చతుర్థకం ... భగవత్ పాద
సేవనం .. ప్రాణ సమమే పంచమమ్
ప్రణవార్చనం ... పుష్టి షష్టమమ్
సాష్టాంగ ప్రణామం ... సర్వ హిత సప్తమం
సర్వదా దాస్యం ... అనంతం అష్టమమ్
సుఖమైన సఖ్యతమ్ ... అత్యుత్తమం
నవమం నిజ భక్తి సాగరం ఆత్మనివేదనం
ఆత్మార్పణం ....
నగునూరి రాజన్న
కరినగరము (రిచ్మండ్)
No comments:
Post a Comment