Wednesday, May 10, 2023

ఒక అప్రకటిత యుద్ధం (2) తేది : 10-11-2022 శీర్షిక : మెరుపుదాడులు ...

 ఒక అప్రకటిత యుద్ధం

తేది : 10-11-2022
శీర్షిక : మెరుపుదాడులు ... 
కవిత సంఖ్య : సహస్రాధికం 

ఖలునకు నిలువెల్ల విషం 
కదరా సుమతీ అన్న చందంగా 
మనిషి ఎంత మంచివాడో... 
అంతటి చెడ్డవాడు కూడా .... 

కపటత్వాలతో కడుపు నింపుకుని 
కాలకూట విషాలు ఒళ్ళంతా 
పులుముకుని... కలుషితాలు 
మనసంతా పరుచుకుని...చాపకింద 
నీరులాఒక వర్గానికి వరాల జల్లులు 
కురిపిస్తూ...మరో వర్గాన్ని నిరాదరణలకు 
గురిచేస్తూండడమే...అతివాదానికి
ఊతమవుతుంది. 
  
అధికార మదాలతో విర్రవీగుతూ 
పాలనలలో పక్షపాతం జొప్పించి 
ప్రాంతాల అభివృద్ధిలో పాతరల 
చిచ్చు రేపుతున్నప్పుడు....దర్నాల
తోరణాలు వేలాడుతుంటాయి…. 

ద్వైపాక్షిక ఒప్పందాలను 
దైవసాక్షానికి వదిలిపెడుతూ 
పరాభవాల పాఠాలను పక్కనపెట్టి  
పదే పదే పక్కలో బల్లెమై కాలు 
దువ్వుతున్నప్పుడు ...  

నమ్మకాలను వమ్ము చేస్తూ 
ధర్మం కాకున్నా దండెత్తి 
వస్తున్నప్పుడు ... న్యాయం 
లేకున్నా..నాదంటూ వాదించినపుడు 
సహజమైన హక్కులను సమాధి 
చేయాలనుకున్నప్పుడు తప్పని 
పరిస్థితి....మెరుపు దాడితోనైనా సరే
పొగరు అణిచివేయడానికి 
అప్రకటిత యుద్ధమై ఆవిర్భవిస్తుంది ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment