Wednesday, May 10, 2023

ఒక అప్రకటిత యుద్ధం తేది : 10-11-2022

 ఒక అప్రకటిత యుద్ధం

తేది : 10-11-2022
శీర్షిక : 
కవిత సంఖ్య : సహస్రాధికం 

నమ్మకాలను వమ్ము చేస్తూ 
ధర్మం కాకున్నా దండెత్తి 
వస్తున్నప్పుడు ... న్యాయం 
లేకున్నా..నాదంటూ వాదించినపుడు 
సహజమైన హక్కులను సమాధి 
చేయాలనుకున్నప్పుడు తప్పని 
పరిస్థితి ....  

సమఉజ్జీలు కాకపోయినా 
వెటకారపు చక్కిలిగింతల్లో ... 
కడుపులో విషం నింపుకుని 
కాళ్ళు మొక్కే సందర్భాలలో ... 

చంచల చపల చిత్తాలతో 
వంచనలకు మారు పేరై 
కపట కాలకూటాలను నింపుకుని 
కవ్వించాలని  పొంచి చూసే వేళల్లో ...  

ద్వైపాక్షిక ఒప్పందాలను 
దైవసాక్షానికి వదిలిపెడుతూ 
పరాభవాల పాఠాలను పక్కనపెట్టి  
పదే పదే పక్కలో బల్లెమై కాలు 
దువ్వుతున్నప్పుడు ...  

తయారుగా లేకున్నా అదాటున 
నెత్తిమీద మొట్టికాయలు కొట్టైనా ... 
మొహం మీద గుద్ది ముక్కు పచ్చడి చేసైనా ... 
బొక్క బోర్లా పడేసి... దిమ్మ తిరిగే 
విధంగా బుద్ది చెప్పాల్సి వస్తుంది ...  

No comments:

Post a Comment