Wednesday, May 10, 2023

కార్తీక పౌర్ణమి తేది : 08-11-2022 శీర్షిక : ఆధ్యాత్మికం ...

 కార్తీక పౌర్ణమి

తేది : 08-11-2022
శీర్షిక : ఆధ్యాత్మికం ... 


లక్షల సంవత్సరాలనాడే 
లక్షణంగా కాలగణనలు చేసిరి ... 
లక్ష్మీసమేతమయ్యే శుచి శుభ్రతలు 
లక్ష్యం చేరే ఆరోగ్యసూత్రాలు ... 

ఉత్సవములను స్థిరీకరించి 
వత్సరమంతా పొందుపరిచిరి 
సత్సంప్రదాయాల సందళ్ళను 
సుందరమున ఆరోగ్యపాత్రముకై .... 

పండగేదైనా ప్రాశస్త్యమే 
పర్వమేదైనా లోక కళ్యాణమే  
పరమపూజ్యులు స్థిరపరిచిరి 
పవిత్రమైన ఆచారాలను ... 

హరిహరులకు  ప్రీతిపాత్రమై 
సురవరులకు సుందరమై 
నరులందరికి నందనమై 
తరువు గిరులకు పూజనీయం ... 

శరదృతువు శీతలాలలో  
మేను రక్షణల మెరుపులకు 
ఉసిరి మేలును ఉల్లేఖించిరి 
పరంధాముని పరకాయముగా ... 

మాసమంతా మణిహారమే 
సోమవారములు ఏకాదశులు 
ద్వాదశులు పౌర్ణమి హేమాహేమీలై
పుణ్యకార్యాల పునీతమౌతూ ...  

కేదారీశ్వరి వ్రతములతో ... 
సత్యనారాయణస్వామి వ్రతములతో 
ఉసిరి తులసీల కళ్యాణాలతో  
ఆధ్యాత్మిక శోభలు అల్లుకును.... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment