కొత్త పోకడ
తేది : 01-11-2022
శీర్షిక : సుందరమైన వివాహ సంస్కృతి
మార్పు ఎప్పుడైనా అనివార్యం...
మార్పు మహోన్నతమై మానవ
కల్యాణానానికి దోహదపడాలి ...
పురోగమనానికి మార్గం కావాలి ...
అఖండమైన అనుభవాలే
ఆచార సంప్రదాయాలుగా
వినుతికెక్కి...సంస్కృతిలో భాగమై
సన్నుతిస్తుంటాయి .... విశ్వమంతా
పొగిడిన మన వివాహ సంస్కృతిలా ..
అనుభవ శూన్యాలతోనో... ఆకతాయి
తనాలతోనో.. పాశ్చాత్త్య మోజులతోనో...
వెండితెరల రంగురీళ్ల విధానాలతో నో...
అనేక వాదాలు తలకెత్తుకుని అపహాస్యం
మూటగట్టుకుంటున్నాయి వివాహ తంతు నేడు ...
పదహారేళ్లకు పండించుకోవలసిన
జీవితాలు ముచ్చటగా మూడు పదులు
దాటి మూలుగుతున్నాయి ...పదహారు
రోజుల పవిత్ర తతంగమంతా మాయం ...
వేదమంత్రాలతో ఘోషించి
సంస్కరించుకోవాల్సిన జీవితాలను
చూపరులకు జుగుప్సాకరంగా
ముందు వెనకల ఛాయా చిత్రాలకు
వీడియోలకు అప్పగించేస్తున్నారు ...
కుటుంబ సభ్యుల మధ్య ఖుషీగా సాగి
ఆత్మీయ దీవెనలతో అందలమై మెట్లెక్కాల్సిన
జీవితాలు .. గొప్పల కుప్పై వేలమంది
మధ్య తూ తూ మంత్రగా కునారిల్లుతున్నది ...
అన్నమో రామచంద్రా అంటూ
ఒకపక్క అలమటిస్తున్న భారతంలో...
ఆడంబరాల పందిరి నీడన
అన్నపానీయాలను అలుగులై పారిస్తూ
చెత్తకుప్పల్లో చెదారంగా పొర్లిస్తున్నారు ...
వింత వింత ధోరిణిలతో ....
విపరీత మనస్తత్వాలతో ...
పెచ్చుమీరిన పుచ్చు విధానాలతో
మూన్నాళ్ళ ముచ్చటై మురిసి
పోతున్నాయి "మూడు" ముళ్ల బంధాలు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment