పుస్తక ప్రదర్శన
తేది : 17-11-2022
శీర్షిక : తరాల వారధి
కవిత సంఖ్య : 181+6
శాస్త్రీయమైనా ... సంప్రదాయమైనా
అంతరంగంలోని అనుభవ అలలను
మస్తిష్కంలోని మనన మంతనాలను
బందీ అయిన భావ ప్రకంపనలను
ప్రోది చేసుకుని నిక్షిప్తం చేయగలిగే
సాధనం పుస్తకం ...
చర్విత చరణాలైన అనుభవ
సారాలలోని అంతరాయాలు
అధిగమించాలంటే... మెరుగులు
దిద్దుకుని భావి తరాలకు బాటలు
చూపే తరాల వారధి పుస్తకం ....
నిరక్షరాస్యతల నిగ్గదీసుకుని
ముడుచుకున్న మొగ్గలెన్నో
సదా పరిమళాలు వెదజల్లే
జ్ఞాన జ్యోతుల మొల్లలై విచ్చుకోవాలంటే
నిశి చీల్పుల పుస్తక విజ్ఞాన జ్యోతులు విరివిగా అందుబాటు కావాలి ....
విజ్ఞానాల పంపకాలకు విస్తృత
బదిలీలకు విస్తరించిన వినూతన
సాధనమే ... వింతగా ఇమిడిపోయే
హస్తభూషణముల పుస్తక ప్రదర్శనలు ....
అపూర్వమైన ... అమూల్యమైన
అనన్యమైనవి ఎన్నో పుస్తకాలు
ఒక్కచోట అందుబాటయ్యే అనువైన
సుందర మార్గం ... పుస్తక ప్రదర్శనం ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment