Wednesday, May 10, 2023

కళాశ్రీ చిత్ర కవిత తేదీ 18-11-2022

 కళాశ్రీ  చిత్ర కవిత 

తేదీ 18-11-2022


పిల్లలకూ పెద్దలకూ 
ఉల్లాసం మిక్కిమౌస్ 
ఎప్పటికీ  ఎక్కడైన 
సంతోషం  మిక్కిమౌస్ 

వ్యంగములకు జంగమయ్య 
వ్యవహారం నామమయెను  
శతాబ్దపూ  చరితలాయె 
ఆనందం  మిక్కిమౌస్ 

చాప్లీనుకు చిరునామగ 
శాశ్వతమై మిగిలిపోయె 
విశ్వమంత  విశిష్టమే 
సంప్రదాయం మిక్కిమౌస్ 

సంచాలన సజీవమై 
వెండితెరన దండిదాయె 
సర్వులకు  పరవశమే 
అనుమోదం  మిక్కిమౌస్ 

విసుగులనూ పారదోలె 
వింతగల్ల ఆకారం 
రారాజుగ వెలుగుతుంది 
సుపరిచితం  మిక్కిమౌస్ 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment