Wednesday, May 10, 2023

అమూల్యం తేది 11-11-2022 శీర్షిక : వడ్డించిన విస్తరి

 అమూల్యం  

తేది 11-11-2022
శీర్షిక : వడ్డించిన విస్తరి 

అక్షర జ్ఞానాల అంగవస్త్రాలను 
ధరించి క్రమశిక్షణగా అడుగులు 
కదిపాక ... బాల్యాన్ని ఒక్కసారి 
దులుపుకుంటే అరలనిండా 
మరామరాలే.... 

తెలిసీ తెలియని తనములో 
తేనె మధురిమలు గ్రోలిన బాల్యం ... 
ఆటల్లో అల్లరిగా గొడవ పడినది 
తొండి ఆటలతో తోటోళ్లపై గెలిచినది .... 

అంకురానికి బీజదళంలా 
ఆత్మీయత మాధుర్యాలు పంచే 
అమ్మానాన్నల ఆలనాపాలనలు 
దొరకడం అపూర్వం...పూర్వజన్మసుకృతం ... 

మొక్కైవంగనిది మానై వంగునా ... 
మొక్కవోని దీక్షాదక్షతలు గల  
గురువుల  ఆశీస్సులందడం
గురుతరమై మెలగడం అనన్యం ...  

బాధ్యతల బాదర బందీలేని 
సుందరమైన ఆటపాటల కొయిలై 
బలాదూరుగా తిరుగాడిన క్షణాలు ... 
కమ్మని జ్ఞాపకాలన్నీ నెమలీకలే 

వడ్డించిన విస్తరిలా విందుభోజనమై 
పొందుగా సమయానుకూలంగా 
అమిరి అందుబాటవడం... అందరికి 
కుదరక అందని ద్రాక్షలైయ్యేది ఎందరికో ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment