Wednesday, May 10, 2023

కణిక - స్మశానవాసి తేది : 02-11-2022 శీర్షిక : అనాయాస మరణం

 కణిక - 

స్మశానవాసి 
తేది : 02-11-2022
శీర్షిక : అనాయాస మరణం 

రాగ ద్వేషాలకతీతమై 
అందరిని సమదృష్టితో 
స్వీకరించి సముచిత 
సత్కారాలు చేసే చోటు
ఆదేనని చెప్పకనే చెప్పే 
లయకారుడివి .... 

బంధాలకు అనుబంధాలకు 
బహుదూరమని చాటిన  
స్థితప్రజ్ఞతల ముక్కంటివి ... 

పేద గొప్పల వ్యత్యాసం 
పేరుప్రఖ్యాతుల ఉన్నతం 
చూపక అందరూ సమానమేనని 
వేషధారణలతోనే వెలిబుచ్చిన 
వేలుపువు .... 

అయినవాళ్లంతా ఆయుష్షున్నంతవరకే 
ఆ తదుపరి అంతా నీవై అందరిని ఐక్యం 
చేసుకునే బహుదొడ్డ భరోసా నీది ... 

సదా నీకు మొక్కేదా ... 
సర్వేశ్వరా సన్నుతించు ... 
అనాయాస మరణంతో 
అంతిమయాత్రకనుమతివ్వు ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment