చిత్ర కవిత
తేదీ : 04-11-2022
శీర్షిక : విచార వదన
కవిత సంఖ్య : 181+1
త్రేతా యుగమున రాముని
ఆనపై సౌమిత్రి వనమున
వదిలిన సీతమ్మలా విధిరాతల
విచార మోమున విచలితయై ....
తేరుపై విహరించే తీరున్నా
విచార వదనయై తీరునాయె
కలికాల కాంతల
వింతలు
కష్టసాధ్యమే మనసు కనుగొనుటకు ....
విద్యలెన్నో నేర్చి విదుషీమణులై
ఉద్యోగములు చేయుచు కూడా
ఉస్సూరుమంటున్నారు నేడు
క్షణమైనను శాంత చిత్తము కానక ....
జీవరాశిలో మనిషి మిన్నైనా
సంతసంబిచ్చు సంఘటన కన్న మిన్నలేదని రుజువులాయె
ఎన్న జూసిన మరొక్కసారి ...
ఆడంబరాలు కాదు అసలు జీవితం
ఆత్మీయ పలకరింపులకై ఆరాటం
అనురాగాల ఓదార్పులకై ఎదురుచూపు
ప్రశాంతతలను మించిన పైకం లేదు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment