Wednesday, May 10, 2023

పాప పుణ్యాలు తేది 09-11-2022 శీర్షిక : మర్మమెరిగి జీవించడమే…

 పాప పుణ్యాలు 

తేది 09-11-2022
శీర్షిక : మర్మమెరిగి జీవించడమే… 
కవిత సంఖ్య : 181+3

ప్రకృతే పరవశించి పండించె 
ప్రజావసరపు  తిను బండారాలు... 
దుర్భినికైనా కానరాని దుష్టాంతాలు 
దునుమాడుటకు దూరం జనమంతా ... 
స్వర్గ తుల్యమే జీవనం - 
అనుసరించిన సత్యయుగం న్యాయం ....  

ధర్మం కుంచించి మూడు పాదాలే అయినా  
పరంధాముడే  పరుశరాముడై , రాముడై 
ప్రజా పాలనలకు పరమార్ధత చేకూర్చె 
యుగాలు మారినా యువత నేర్చుకోవాల్సింది --
ఆచరించి చూపిన త్రేతాయుగం నీతి ... 

వేదాలు నాలుగయి వెలుగొందు విశ్వాన 
వేదనలు అంతర్గతంగా వేటాడి వెంబడించు 
వెన్నదొంగయిన పురుషోత్తముడే  
వెతలుడిగే గీత బోధించె మానవ కళ్యాణానికై ...
బోధించి తెలిపిన ద్వాపర యుగం ధర్మం  ... 

దాన ధర్మాలు ఒకవంతై అలరించ 
దానవులై నర్తించు మానవ ముష్కరులు 
దండిగా గాండ్రించు కలుషితాలన్నింట 
దగా మోసములే కలి చిరునామాలు.... మానవా !

ఖర్మలననుసరించే...  స్వార్థం  
పరమార్థం,పురుషార్థం.....  
ధర్మాలనునుసరించే ఖర్మఫలం  
యుగాలననుసరించి ధర్మం....  

గీతాచార్యుడి బోధనల సారాంశమే ...  
ఎవరి జన్మకు వారే బాధ్యులు 
ఎవరి కర్మలకు వారే సాక్షులు 
వివేకం విజ్ఞానం ప్రసాదించిన దేవునికి 
కృతజ్ఞతలు తెలిపి జీవన మర్మమెరిగి 
భావంగా మసలుటయే  మానవ ధర్మం 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment