కన్నీళ్లను ఖననం చెయ్యి
తేది : 09-11-2022
శీర్షిక : కీర్తి శిఖరం .....
తల్లికడుపులోనుండి మొదలయిందే
తండ్లాటల ఒంటరి పోరాటం ...
ఆటవికతలనుండి అవలంబించిందే
అలుపెరుగక నిలదొక్కుకున్నదే ..
అడుగడుగున సుపరిచితమే...
అంతగా నూతనత్వమేమి లేదు ...
నిలిచిన నీరు కుళ్లిపోయి
పారే నీరు పవిత్రమైనట్టు...
నిలబడి నీరసించి కన్నీరు
పెట్టుకుంటే ప్రయోజనం శూన్యం ...
రాతిపనిముట్లుగ రాటుదేలినా ...
శిలలెన్నో శిల్పంగా మారినా ...
సంకల్పం తలకెత్తుకుంటే
పట్టుదల దీక్షలే పెట్టుబడిగా ....
గమ్యమెరిగి చరించుమా
గగనమైనా భీతిల్లకుమా
గమనం నీవెన్నుకొనుమా
విజయం నీ చెంత నిలుచునూ ...
ఎవరో వస్తారని...ఎదురు చూడకు
జగతి నిన్ను మెచ్చు విధముగ
భవిత నీకు నీవుగా నిర్మించుమా
ఉదాహరించే విధముగానూ
చరితనంతా తిరగరాయుము ..
నీకు నువ్వే ఎపుడు గొప్ప
తగవు న్యూనతమ్ములు
తుడిచి కన్నీళ్లు ఖననం చేసి
తలువుము నీ సామర్థ్యమ్ములు
తోడు నిలుచును తథాస్తులు
కూడ వచ్చును మకుటమై గుర్తింపులు
చేరవచ్చును కీర్తి శిఖరమై ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment