కళాశ్రీ
బాలల దినోత్సవం .
తేది : 144-11-2022
శీర్షిక : నిత్య బాలల దినోత్సవమే ...
సంఖ్య : 181+5
చిగురాకుల బాల్యం చాలా
సుందరమైనది...మంచి చెడుల
భేదమెరుగదు...కల్మషాల
ఛాయాలుండవు ...కల్లా కపటాల
జాడలుండవు .....
బాలలు ఇంట్లో తిరుగాడుతుంటే
మల్లె పరిమళాలు వెదజల్లి
మరువ దమనాలను గుజిగుచ్చి
నట్టుంటుంది…సుమసుందరమే
వారి అల్లరితో….
పిల్లల్ని బడికి బయలుదేరదీయడమంటే
ఉరుకులు పరుగులతో అమ్మానాన్నలకు
ఉదయాత్పూర్వమే యుద్ద తయారీల కవాతు…
ఎదురందించడం ముద్దు ముద్దుగా…
పిల్లలు బడికెల్లగానే బతుకు జీవుడాని
ఇల్లంతా సర్దుకుని…అలసట తీర్చుకుని
సరికొత్తగా ఆరితేరి సరంజామా సర్దుకోవాలి
రెండవ అంకానికి సిద్దంగాఉండాలి అమ్మ…
మరో మినీ యుద్దరంగానికి …
నిత్యం ప్రశ్నలతో మనల్ని ఆరితేరదీస్తారు…
చూసీ చూడనట్టు… పట్టీ పట్టనట్టుంటారు
కాని అన్నీ బుర్రకెక్కించుకుని ఏడున్నొక్కరాగం
తీసినప్పుడు అన్నీ ఏకరువు పెడతారు ….
పిల్లలున్న ఇల్లు నిత్య బాల్యదినోత్సవాలతో
కళకళలాడే నందనవనమే…మనం పాటించే
క్రమశిక్షణలే వారికి మార్గదర్శకమై మంచి
సమాజ నిర్మాణానికి నాందీ అవుతుంది…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment