జీవన తాత్పర్యం
తేది : 04-11-2022
శీర్షిక :
కవిత సంఖ్య : సహస్రాధికం
సకల ప్రాణికి దారాదత్తం ఈ ధాత్రి
మహిలోన మానవాళి సర్వోన్నత
మన్నది జగద్విదిత సత్యం ...
ఉత్తమ జన్మకు ఉభయులు మూలం
తప్పక మనము తలచుట భావ్యం
మాతృదేవోభవ ... పితృదేవోభవ ...
సన్మార్గమునకు విజ్ఞాన వివేచనం
సమయానుకూల మార్గనిర్దేశకులు
సర్వగురువులకు సత్వందనం ....
విధిగా విధేయమై మెలగడమే సూత్రం ...
అనుభవాలను ప్రోది చేసుకుంటూ
నీలోనికి నీవే తొంగి చూసుకుంటూ
సంస్కరణల మొగ్గలు తొడుక్కోవడమే ...
పల్లెతల్లి ఒడిలో కన్ను తెరిచి
ముల్లె మూటల కదిలి పట్నమెళ్లినా
మూలాలను తడుముకునే ముచ్చటెంతో హాయి ...
బంధనాలేమి లేకున్నా బంధుత్వపు
పిలుపుల పల్లెజనం మాట మనసుకెంతో హాయి ...
బతుకు రాట్నమోలే తిరిగినా ..
బంగారు జాడలను ఆస్వాదించాలె ...
కళ్ళకద్దుకునే బంధు మిత్రులతో
కష్టసుఖం పంచుకుని సేద దీరాలి ...
బావిలోని కప్పలా బరిగీసి బతకడం కాదు ..
విశాలమైన విశ్వంలో ప్రత్యక్షమైన సేవల
ప్రకృతి పాఠంలా ఆపన్నులకు కొంతైనా
పంచడం నేర్చుకుంటే ఆత్మ సంతృప్తి ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment