Wednesday, May 10, 2023

గుప్పెడు అక్షరాలు తేది : 11-11-22 శీర్షిక : రాజనాలు ...

 గుప్పెడు అక్షరాలు

తేది : 11-11-22
శీర్షిక : రాజనాలు ... 
కవిత సంఖ్య : సహస్రాధికం 

కాలాన్ని కరగదీసి కలంలో 
పోసి కవాతు చేస్తే...మార్పుకు 
ఓంకారమై మరో ప్రపంచం 
నిర్మించగల సత్తా చాటుతుంది ... 

పిల్లలతో పల్లవించాలన్నా ... 
యువతలో భవిత నాటాలన్నా ...
అంకురాలకు  జీవజలమై... 
ప్రజా పంటను రక్షించే క్షీరధారలౌతాయి ...  

పాలనలకు ప్రక్షాళన సూచికలై 
ప్రజల సంక్షేమాలకు పట్టుగొమ్మలై 
రామరాజ్యాలను పరిచయించ 
హరివిల్లులా పూల బాటలేస్తాయి ... 

ధైర్య సాహసాల విత్తనాలు జల్లి 
శత్రువుల గుండెల్లో శతగ్నులు పేల్చి 
రాతి గుండెల్లో సైతం జలనిధుల 
శోధనలు చేసి రంజింపగలవు  .... 

గుప్పెడు అక్షరాలే అనుకుంటాం 
కానీ , గుండె గూటిలో రాజేస్తే ... 
రైతన్న పొలములో రాజనాలు 
పండించినట్టు.. ఏ విత్తనాలు వేస్తే .. 
ఆ పంటలను పండిస్తూ అలరించవచ్చు ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment