సొంతింటి కల
02-11-2022
కలిగినోళ్లకు కష్టమనిపించకపోయి నా
లేనోళ్లకు లెక్కకందని ఊహ
విలువైనది వింతైనది గొంతెమ్మయి ...
నిదుర పోనీయదు ...నిలబడనీయదు ....
పిసరంత పిచ్చుక ఎంత గొప్పదో
నారాలన్నీ ఏరి ఏరి కోరి తెచ్చి
కోసుకొమ్మన కట్టుకుంటుంది ...
ఎండావానకు దండి గూడుగా ...
గడ్డిగుడిసెలె నాడే గడ్డుకాలమయ్యింది
కలిగినోళ్లకే మట్టిగూన సిమెంటుగూన
ముచ్చటగా మూడిళ్ళ భవంతులు
లేదంటే చతుశ్శాల భవంతులు ...
ఇప్పుడంతా కొత్త కొత్త కథ ...
ఎకరాల చొప్పున తాతల మాట...
కుంటల లెక్కన తండ్రులనాటి మాట ...
గజాల లెక్కన గగనం అవుతున్నదిప్పుడు ...
ఇసుకయితే రాజకీయం నేర్చుకుంది
సిమెంట్ స్టీలు పెట్టుబడిదార్ల చుట్టమైం ది
ధరలన్నీ చుక్కలాంటినాయి ...
ఇక కార్మికులతో బేజారెత్తుడే ...
వజ్రోత్సవాల వాకిట నిలిచినా ...
మానవత్వాలు మరిచిన మున్సిపాలిటీలు
మంచితనం ఎరగని కరెంటోళ్లు
లంచాలకు రేట్లు నిర్ణయిస్తుంటే
వాడవాడలా జెలగలైన కార్పొరేటర్లు ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment