కణిక
పూల సందేశం
మినీ కవిత
తేది : 11-11-2022
శీర్షిక : పరోపకారం ...
పుట్టీ పుట్టగానే పుష్కలమైన
తేనియలను భ్రమరాలకు
పంచుతూ ...
పరిమళాలను పరిసరాలకద్ది
శోభాయమానం చేస్తూ ...
ఆయుష్షు అల్పమైనా మాలలై
పరంధాముని గళములోనో ...
పడతుల శిఖలలోనో ప్రకాశించి
పరులకొరకే జీవనమని సంకేతించు ....
No comments:
Post a Comment