గేయము. భార్య
తేది : 06-11-2022
శీర్షిక : ఆలి ఎంత అద్భుతమో
ఆలి ఎంత అద్భుతమో
ఆలి ఎంత ఘనతరమో
ఆదిశక్తి అభయముగా
అష్టలక్ష్మి విభవముగా
పుట్టినింట మహారాణిగా వెలుగొందినా
మెట్టినింట మహాలక్ష్మిగా చేరుకొనును //2//
పరాయింటి తరుణీమణి
పదిలమై నడిచివచ్చు ....
కోట్లకొలది ఆశలతో కొత్త కొత్త జీవితాన
పెనిమిటి గుండె గూటికి ప్రేమంతా నింపుకుని //2//
వందేండ్లు పొందుగాను
నందనాలు పంచుటకు...
ఆలి ఎంత అద్భుతమో
ఆలి ఎంత ఘనతరమో
ఆపద సమయాలలోన అన్వేషణ సాగించి
అనువైన మార్గాలతో ఆపన్న హస్తమై... //2//
భరోసాలు నింపగలుగే
బాధ్యతగల మంత్రివరి .....
సతిగా వెలుగులు పంచుకుంటూనే
పతిని సదా కనిపెట్టుకును గుంభనంగా //2//
సుఖ దుఃఖాలలోన సుందరమగు
దివ్యౌషధమే ఓదార్పులు ...
ఆలి ఎంత అద్భుతమో
ఆలి ఎంత ఘనతరమో ..
భర్తింటి గౌరవాలను బాధ్యతల తోడుగా
భవ్యంగా ఇనుమడించి నిలుపుతుంది తాను ...//2//
అత్తింటి మర్యాదను
ఆదరించి నిలుస్తుంది ...
వంటింటి మహారాణియై కంటికి రెప్పలా
ఇంటిల్లిపాదికి ఇలవేల్పే కనిపెట్టుకోగా //2// ....
సదా అందరిని కలుపుకుని
సవ్యసాచి అవుతుంది ...
ఆలి ఎంత అద్భుతమో
ఆలి ఎంత ఘనతరమో
ధర్మార్థ కామ మోక్షాలకు కట్టుబడిన మహిళగా
ధర్మపత్ని అవతారం ఎత్తుతుంది బాధ్యతతో //2//
వారసత్వ నైతికతల
వంశానికి అంకురమీయ ....
సంతానలకాది గురువుగ చదువులు చెప్పంగ
చదువులలో ప్రతిభనిల్పు పిల్లలకు తానై //2//
సరస్వతమ్మ ప్రతినిధియై
సమున్నతంగ తీర్చిదిద్ద...
ఆలి ఎంత అద్భుతమో
ఆలి ఎంత ఘనతరమో
వియ్యమందిన చోటల్లా ఓపికలు ఒద్దికతో
నెయ్యమును ప్రదర్శించు నేర్పుగానెప్పుడు //2//
విదురనీతుల విడమరిచి
కుదురుగాను చక్కబెట్టు ...
సంతతినే కాకుండా
సంతసాలు పొందును
పౌత్రులను ప్రాణమోలే
ఆదరించి పథం చూపు ....
ఆలి ఎంత అద్భుతమో
ఆలి ఎంత ఘనతరమో
పతివ్రతల అంశగానూ ప్రతినను బూని
పతియే ప్రత్యక్ష దైవంగా తలచి ఎపుడు //2//
పాటించే సమున్నతం
హైందవమున ప్రఖ్యాతం ....
కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ,
రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ,
భోజ్యేషు మాతా, శయనేషు రంభా
భోజ్యేషు మాతా, శయనేషు రంభా
షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ.
ఆలి ఎంత అద్భుతమో
ఆలి ఎంత ఘనతరమో
ఆదిశక్తి అభయముగా
అష్టలక్ష్మి విభవముగా
నగునూరి రాజన్న
No comments:
Post a Comment