కవన రవళి
చిత్రానికి గజల్
నగునూరి రాజన్న
19-11-22
మననములో ముసిముసిలే
విరిసెనుగా
ఇందువదన
మధురమైన గిలిగింతల
నిలిచెనుగా ఇందువదన..
ఎదురుచూపు ఎంతహాయి
మనసైనా ఆలోచన
వలపులవల మదిలోపల
కలిగెనుగా ఇందువదన..
కనులనిండ ఆరూపం
తొణకిసలై కులుకుచుండె
నిదురవీడి చూస్తున్నది
కాంచెనుగా ఇందువదన..
సమయమంత మించిపోగ
విరహినియై కలతచెందె
నెలరాజును కలలోనా
పిలిచెనుగా ఇందువదన..
హృదిలోపల ఆరాటము
మటుమాయం చేయుమాట
రాజసమై తోచునేమొ
తలిచెనుగా ఇందువదన..
No comments:
Post a Comment