Wednesday, May 10, 2023

సంకెళ్లు నాకేం కొత్త కాదు తేది : 16-11-2022 శీర్షిక : విలువల కొక్కెం

 సంకెళ్లు నాకేం కొత్త కాదు 

తేది : 16-11-2022
శీర్షిక : విలువల కొక్కెం 
కవిత సంఖ్య : సహస్రాధికం 

విలువల కొక్కేనికి వేలాడుతూ 
పరిమితుల పరిధిలో  పరిభ్రమిస్తూ
తప్పు లేకున్నా.. తప్పుకుంటారే తప్ప ... 
ఎదురెళ్లి పోరాడని తత్వమే పల్లెన్నయినా 
పట్నాన్నైనా...  

ఉస్సూరుమన్నప్పుడల్లా ఊపిరి 
ఉగ్గబట్టుకుని మసులుకోవడమే కానీ .. 
ఉడుకుమోతుగా ఉరుకులాడేది లేదు   ... 
ఊరు మీద పడి బలాదూరుగా ... 

ఆబగా అధికారాన్ని అందుకోలేక 
అలసత్వంతో లేనోడిగా చలామణి కాలేక 
మధ్యతరగతి మిధ్య బతుకులన్నీ  
గానుగలో తంగేడై నలిగిపోతూనైనా ... 
నవ్వులతో నువ్వుల నూనెలు పంచడమే  ... 

ఆధ్యాత్మికతల అంటుసొంటులో ... 
సంస్కృతీ సంప్రదాయాల సద్భావనలో ... 
పుట్టి పెరిగిన పుణ్య  పరిస్థితులో ...   
పుణికిపుచ్చుకున్న పూర్వుల  బుద్దులో ... 
హద్దు మీరని సుద్దుల పద్దులే .... 

అప్పుడప్పుడు వలస వాదంలో  
పూర్వీకుల గాయాల మననమో ..  
పడిన కష్టం తిరగబెడుతుంటే వల్లె 
వేసిన కథనాలో... పెద్దల సలహాలో ... 

ఇప్పటికీ .. మధ్య తరగతులెందరో 
మహిమాన్వితమై పాటిస్తున్న పాఠం ...
అనవసరంగా తల దూర్చని వాదం  ... 
హిమాలయమైన మన దేశ తత్వంలా ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment