కవన రవళి
గజల్
5/5/5/5
హిమనగపు సానువుల ఒడిసింది కాశ్మీరు
పరవశమె డెందమున నింపింది కాశ్మీరు
కమనీయ సొగసుతో జలసిరుల సెలయేళ్లు
రంగులా హరివిల్లు విరిసింది కాశ్మీరు
ఎనలేని షోకులా ఎత్తైనా సరస్సులు
గుల్మార్గ్ అందంతొ మురిసింది కాశ్మీరు
మేనంత జల్లుమన
మేఘముల తాకుతూ
చినుకులా వర్షించి మెరిసింది కాశ్మీరు
భారతీ తలపైన రాజుకూ మకుటమై
సంతసం పంచగా నిల్చింది కాశ్మీరు
నగునూరి రాజన్న
No comments:
Post a Comment