కవన రవళి
అమ్మ ముక్కు పుడక
తేది : 07-11-22
శీర్షిక : ఔషధ మూలికలు ...
వింత ప్రశ్న సంతకెళ్లినట్టు
అమ్మకు అక్కకే ఎందుకు అన్ని నగలు
నాన్నకు నాకు ఎందుకు పెట్టరని
నవ్వులు పూయించే సంశయాల సంచి ...
నా చిన్నప్పుడు ...
ఇంటికే పరిమితమయ్యే ఇంతులు
కంటికి కనపడని క్రిమి శత్రుబాధల
ఉపశమనాల ఆవిష్కరణలు
ఉచ్వాస నిచ్వాసల వడపోతలు...
ఒంటిరాయితో కంటికింపైనా
అరవంకీగా నెలవంకలైనా ...
పుష్యరాగాల పున్నమి వెలుగులైనా
రూబీలతో రాగాలు పొదువుకున్నా ....
డైమండ్లతో జిగినీలు తొడుక్కున్నా ...
ముత్యాలతో వెన్నెల సొగసులీనినా ....
కళ్యాణ వైభవములలో కన్యాదాన
ఫలితాలకు ... గౌరీ పూజల పుణ్యాలలో ..
వ్రతాల వారసత్వంలో అత్యంత
శ్రేష్టమని ఆచార సంప్రదాయం ....
ఆరోగ్యాల చిరునామాలే
అల్లుకున్నవి ఆచారంగా ...
అందరు అందరికి సుందరంగా
విడమరిచి చెప్పకపోయినా ....
ప్రాథమికంగా శ్వాస సంబంధమో ...
ఘనముగా గర్భసంచీ సంబంధమో
ఏదైనను ఏమైనను ఇంటికి దీపం
ఇల్లాలన్న దేవతల ఒంటికి
అంటిపెట్టుకునే ఔషధ మూలికలు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment