అద్భుతం
తేది : 22-11-22
శీర్షిక : అయ్యప్ప జ్యోతి దర్శనం
కవిత సంఖ్య : 181+8
శరదృతువు వేళలలో
కార్తీక మాసమున కరుణ నిండిన
హరిహర పుత్రుడు అయ్యప్పను
శరణంటూ వేడుకుంటిమి ... .
కదిలాము ఇరుముడితో కొండకు
గురుస్వామి దీవెన తోడుండగా
పెద్దపాదం నడుచుకుంటూ
పెన్నిధిగా దినమంతా ....
అళుదా నది దాటుకుని
కరిమళ... పెరియానపట్టం ...
చెరియానపట్టం దాటుకుని ...
చేరాము సంబరాన పంబానదికి ...
పవిత్ర నదీ స్నానం కావించి ...
నింగినంటే నీలిమలై దాటుకుని
చేరుకుంటిమి సన్నిధి ప్రాంగణం...
మకర సంక్రాంతి రోజున ....
పదునెట్టాంపడి కళ్ళకద్దుకుని
స్వామియే శరణమంటూ శరణుఘోషలు
పిక్కటిల్లగ .. శంభు తనయుని కనులారాగాంచి
అభిషేకాలు గావించుకుని....
జ్యోతిదర్శనార్థం వేచియుంటిమి
ఆకాశమార్గమున పక్షిరాజు పహారాలో
సాయం వేళ సంబరాలతో వచ్చిన
ఆభరణాలను ఆలంకరించిన మరుక్షణం ...
అల్లంత దూరాన కొండలపై
ప్రత్యక్షమైన జ్యోతి దర్శనంతో
ఆనందాల వర్షించిన కనులకు
అద్భుతమే ఆనాటి సంఘటన
జీవితాంతం ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment