Wednesday, May 10, 2023

నిండిన శూన్యం 15-11-22 శీర్షిక : చీకటి వెలుగులు.

 నిండిన శూన్యం 

15-11-22
శీర్షిక : చీకటి వెలుగులు.  

చీకటి వెలుగుల్లాంటివే 
ఆటల్లో గెలుపోటములైనా ... 
ఆశలు అప్పుడప్పుడు అడియాసలే 
అంతటా శూన్యం ఆవరిస్తది ... 

యోధాన యోధులై ఉండి 
నూటముప్పై కోట్ల జనులకు 
ప్రతినిధులై.. ఉత్తమోత్తమ 
కీర్తులు మూట కట్టుకున్నా సరే . 

కాలం కర్మం కలిసిరాకుంటే 
కట్టే పామై కరుస్తుందన్నట్టు ... 
పోరాడి ఓడినరో ... ఓటమికి 
పోరాడినారో కానీ నిరుత్సాహాన్ని 
నింపారు ... 

టి ట్వంటీ టోర్నమెంటులో 
అనుభవజ్ఞులైన ఆటగాళ్లు 
అందలంక్కాల్సింది పోయి 
అదఃపాతాళంలోకి నెట్టేశారు ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment