Tuesday, March 7, 2023

చిత్ర కవిత తేది : 21-10-2022 శీర్షిక : రాధాకృష్ణులు

 చిత్ర కవిత

తేది : 21-10-2022
శీర్షిక : రాధాకృష్ణులు
కవిత సంఖ్య :  170+6

మదిలో తలచిన మరుక్షణమే 
ముమ్మూర్తులా వాలిపోయే చిత్రంగా 
హంసల కొలనులో తనువూగగా 
అనుబంధానికి ఆమడలైనా 
చిన్నబోవు అర క్షణకాలంగా .... 

పేరులోనే పెన్నిధియై 
నామ సంకేతమునకు 
వసివాడని ప్రేమ భావనలకు 
సంపూర్ణత్వం నింపిన 
అపూర్వ కలయిక....రాధాకృష్ణ  

రాధమ్మ మనసులో మెదలగానే 
నీడలా వెన్నంటే వెన్నదొంగ... 
చకోరమై వేచి.. స్మరణలతోనే 
ప్రత్యక్షం చేసుకోగల ధీశాలి ... 

భౌతిక భావాలకతీతంగా 
స్వచ్ఛమైన వారి ప్రేమ 
సర్వవేళలలో సముచితమై
హృదయంలో వికసించిన పూదోట .. 

అమలిన పవిత్ర ప్రేమకు 
ఆ జంట సదా నిర్వచనం... 
అపురూప జంటగా సదా 
పూజనీయం హైందవమున ... 

No comments:

Post a Comment