Tuesday, March 7, 2023

హరి హరులు తేది : 28-10-2022 శీర్షిక : కార్తీక మాసం

 హరి హరులు 

తేది : 28-10-2022
శీర్షిక : కార్తీక మాసం 

స్థితి కారక కేశవ దామోదరం
లయకారక జటాజూట శివోహం 
ఏకోన్ముఖులై జీవ జలాలను
ఆదుకునే మాసం కార్తీకం..... 

కార్తీకానికి సమ మాసం లేదు 
మహావిష్ణువుకు సమమగు దేవుడు లేడు 
వేదంతో సమానమైన శాస్త్రం లేదు.. 
గంగతో సమానమైన తీర్థం లేదు ... 
శివుడికి కూడా ప్రశస్తమైన మాసం ... 
స్కాందపురాణం ఉవాచ ... 

కార్తీకమంటేనే దామోదర ప్రియమని.....  
సకల జనులను సన్నుతిస్తూ 
సంఘ క్షేమానికి సంక్షిప్తపరిచిరి  
సర్వ శ్రేష్ఠమని  ప్రస్తుతించుతూ 
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం..... 

ఆచారం సంప్రదాయం సమున్నతం 
అన్నీ సశాస్త్రీయం...  కలగలిసిన  
హైందవం...నదీ స్నానం ఉపవాసం 
హరహర మహాదేవ అంటూ చెంబుడు 
నీళ్లకే సకల కోరికలు దీర్చి సంబరపడి 
పోయే బోళాశంకరుడు .... ... 

శిశిరంలో భాసురమై వెలుగు కార్తీకం 
మాసమంతా పర్వపుపరమై వెలుగు 
హరి హరులను భేదమెంచక 
ఆలయాలన్నీ ఆధ్యాత్మిక శోభలతో ... 

No comments:

Post a Comment