Tuesday, March 7, 2023

ఒక సారాంశం కోసం తేది : 10-10-2022 శీర్షిక : మనతోనే .....

 ఒక సారాంశం కోసం 

తేది :  10-10-2022
శీర్షిక : మనతోనే ..... 
కవిత సంఖ్య : సహస్రాధికం 

తెలిసీ తెలియని బాల్యం నుండి 
తెలుసనుకుంటున్న జీవితమంతా 
బంక తీగలా సాగదీసుకుని మళ్ళీ 
నిగ్గదీసుకుంటూ... జారిపోతున్న 
సమాధానం దొరకని ప్రశ్నల పరంపరలే ... 

ఏ చల్లని దీవెనల తావియో 
ఏ తపః  ఫలమో అదృష్టంగా 
ఎదురొచ్చిన అందమైన
ఎదురుచూడని  మానవజన్మ ... 

అమ్మానాన్నల ఆత్మీయతల పూదోట 
తోబుట్టువులతో పెనవేసుకున్న 
తోరపు అనుబంధాల లోగిలి....  
తల్లి పాలు పంచుకున్నతనువులు 
ఒకరికొకరై తపనపడ్డ జీవనచిత్రం.. 

అందరిదీ అదే దారయినా కొందరిది 
మాత్రం...వీడని కేశపు చిక్కుముడిలా 
కాల చక్రపు కదలికలలో కబంధమై 
బిగుసుకుని భీతిల్లి మాయమవుతుంది .... 

మిణుకు మిణుకు వేల నక్షత్రాలకన్నా 
ధృడ సంకల్పాల వెలుగు పూలు 
పూయించే వెన్నెల పున్నమి చంద్రులు 
ఒక్కటైనా ఆ కుటుంబంలో జ్యోతులే ...  

అవును...తేలికైన పరనిందలకన్నా 
తేటతెల్లపు నడవడికలే తేనెలొలుకు 
మనకై మనమే ఒక్క అడుగు ముందేసి .... 
కొంత స్వార్థాలను చంక దించేసి 
త్యాగాలతో తనువును చుట్టుకుంటే ... 


No comments:

Post a Comment