సద్దుల బతుకమ్మ
తేది : 04-10-2022
శీర్షిక : శక్తి పూజ
కవిత సంఖ్య : 170+1
శరన్నవరాత్రులలో శరణు
వేడి కొలిచే శక్తి పూజ ...
ముగ్గురమ్మల మూలపుటమ్మైన
పెద్దమ్మ దుర్గాదేవిని ....
శంభ నిశుమ్భల దునుమాడిన
మహిషాసురమర్దిని జయజయహే
తల్లిని కొలుతురు అతివలంతా
తనివిదీరా తీరొక్క రాగంతో .....
రంగురంగుల పూలను తెచ్చి
శోభాయమానంగా త్రికోణంగా పేర్చి
కష్ట సుఖాలను కలబోసుకుని
గౌరమ్మనుంచి కలికిరాగాలతో
గానకోకిలలైపోతారు .....
సింహవాహిని చిద్రూపిణి
దుష్టులను దునుమాడిన తల్లిని
తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలుగా
పూజించి కొలిచేదే నవరాత్రులు ....
వలసవాద పాలనలలో
వజ్రాయుధమై వర్ధిల్లినది
భావ సాంద్రతను బలీయమై
ఐక్యత రాగమై ప్రదర్శించ ....
No comments:
Post a Comment