Tuesday, March 7, 2023

పెట్టెలోని పట్టుచీర తేది : 06-10-2022 శీర్షిక : రాజసం…

 పెట్టెలోని  పట్టుచీర 

తేది  : 06-10-2022
శీర్షిక : రాజసం… 
కవిత సంఖ్య : సహస్రాధికం 

యుగయుగాల భరత జాతి గౌరవం 
జగాన ప్రత్యేకమే చీరకట్టు 
వందల నుండి లక్షలలో పలికినా 
లక్షణంగా పడతులనాకర్షించు .... 

సప్తవర్ణాలు సంతరించుకుని 
రమణీయతలు పెంచుకుని 
అందమైన చీరలుగా అలరించి 
సొగసులీను హైందవాన చీర .... 

సుతి మెత్తని సుందరం 
కట్టుకుంటే కమనీయం 
గాంభీర్యతల రాజసం 
పెళ్లి పేరంటాలలో డాంబికం ... 

ఒత్తైన రంగులలో ఒద్దికగా 
ఒదిగిపోతూ ...ఉత్సవాలలో 
ఊరేగుతూ... అందంగా అమిరిపోవు
అతివలందరికి ...చిన్నా పెద్దా 
తేడాల్లేక  చిద్విలాసముగా .... 

చిన్న చిన్న మార్పుల రూపరచనలకే  
చింతలతో మిగిలిపోవు పెట్టెల్లోన ... 
లెక్కలేని రకాలతో ఉక్కిరి బిక్కిరి 
చేసినా సరే  ... పక్కాగా కొనాల్సిందే 
ప్రతీ ఉత్సవానికి ... మహోత్సవానికి....
ఒకప్పుడు ....  

పాశ్చాత్య నాగరికతల పాము 
నీడలలో తచ్చాడుతున్న యువత 
కట్టూ బొట్టూ అన్నీ కనికట్టయ్యాయి... 
అప్పుడప్పుడు మాత్రమే ధరింపుకు నోచుకునేవి.. 
కాస్త కంటికి నల్లపూసై పోతున్నవి ... 

No comments:

Post a Comment