Tuesday, March 7, 2023

రాయబడని కావ్యాలు 2 తేది : 27-10-2022 శీర్షిక : మనీషి లోని మరో కోణం

 రాయబడని కావ్యాలు 

తేది : 27-10-2022
శీర్షిక : మనీషి లోని మరో కోణం
కవిత సంఖ్య : సహస్రాధికం 

అనుక్షణం ప్రజల సంక్షేమాలను ఆశిస్తూ 
అరువదేండ్లు పాలించిన అశోకునికన్నా 
పదకోండేండ్లు పాలించిన అలెగ్జాండరును 
గొప్పగా చిత్రీకరించిన నాటి మీడియా గోత్రాలు...  

ఒక్కటంటే ఒక్కటే రావణ కాష్టం 
నిప్పు రాజేశినా గొప్పలంటూ ... 
చిక్కులన్నీ లెక్కచేయకుండా 
అలవోకగా ఆరువందల సంస్థానాలను 
విలీనం చేసినా దక్కని గౌరవాన్ని ... 

ఖలునకు నిలువెల్లా విషంలా 
మొగిలిపూల వనంలో కాలనాగులా  
తరాల ముందు కాలమునాడే తలకెత్తుకున్న 
గాంధారపు కాందిశీకుల కౌశలము .....  

మితవాదులగ ముద్రలు వేసుకుని
అహింసా వాదులతో అంటకాగి 
అంతర్గత మంతనాలతో ... అసలు 
అంకె అచ్చు పడని చెల్లని నోటుతో 
నోముకున్నోడి ఫలం నోచుకున్నోడి 
వంతులా...తన్నులాటలో తస్కరణలు  ..... 

చాప కింద నీరులా... తలచినదే 
జరిగినదా అన్నట్లు ... తమ ఇష్టాలకు 
సంవిధాన సంధానం  చేసుకున్న 
ప్రజాస్వామ్య వన్నె రాజరికాల గురించి ...... 

విజ్ఞాలందించాల్సిన  విద్యాశాఖ 
విహంగాలను నరికి .. వింతగా రాక్షస 
ప్రవృత్తులను రమణీయ మనోహరంగా 
చదివింపజేసిన నాటి పాలనా దక్షతలను  .... 

అబ్బో ....ఒక్కటేమిటి ... లక్కు కలిసి వస్తే 
లెక్కకు మించి....మనీషి లోని మరో కోణం…. 
ఎన్నో…ఎన్నెన్నో…రాయబడని కావ్యాలు …. 
మనిషి మనిషికి నీడలాంటి మరో చరిత్ర… 

No comments:

Post a Comment