Monday, March 6, 2023

పదాలు కవిత --కణిక ఏరువాక

 రవి వారం రాగ కణిక

తేది : 9/10/22
శీర్షిక : 

పదాలు : ముసురు, విసురు, కొసరు, కసురు
               తెలుసా, అలుసా, అసలు


తొలకరితో నింగి పలకరించగానే 
సిగ్గులతో బుగ్గలన్నీ తడుపుకున్న  
అవని మాత అందాలకు...వరుణుడు 
చినుకు పూల పుష్యరాగాలను 
కొసరుగా  చిలకరించాడు ... 
  
కొండా కోనా వాగూ వంక తలారా 
అభ్యంగన స్నానాలు గావించి 
కసురుకోకుండా హరిత భరితములై
అడవితల్లి పచ్చందాల శోభలతో 
పట్టు కోక చుట్టుకుంటుంది .... 

మరకత శోభలు సంతరించుకుని 
విచ్చుకున్న బుగ్గల నునుసిగ్గులు 
కెంపు వర్ణాలను అద్దుకొనంగ  
ముసురుకుంటుంది  సీమంతం... 

సంగీత విభావరిలా సతతం 
విసురుకుంటున్న గాలులకు 
శశిరంలో అలుసై తలలు దులుపుకుంటూ 
సాగిపోతుంది కాలమానము ..... 

వసంతం వాలిపోగానే...కొండంత 
బలాలు పొదువుకుని కొంగొత్త చివురులతో 
చిత్రకారుని చేతిలో కుంచెలా 
లేలేత కెంపువర్ణాలు అద్దుకుని 
మళ్ళీ అందాలను ఆరబోస్తుంది 
ప్రకృతి తెలుసా .... 

శ్రావణ మేఘాల సిరిజల్లులకు 
సంద్రపు నీటిజాడలతో 
ముసురుకుంటున్న 
అసలైన స్వాతిముత్యాలు 

No comments:

Post a Comment