Tuesday, March 7, 2023

కిటికీ రెక్క తేది : 26-10-2022 శీర్షిక : సంజీవని

 కిటికీ రెక్క

తేది : 26-10-2022
శీర్షిక : సంజీవని 
కవిత సంఖ్య : సహస్రాధికం 

ముచ్చటైన ఆకారాల ముదముగ పొదువుకుంటే 
సుందరమై పొందికగా కుదిరితే 
చూడ చక్కని దృశ్య కావ్యమై.. 
చూపరులను ఆకట్టుకుని 
ఇనుమడించు ఇంటి అందం...  

దర్జా ఠీవిలకు దర్పణములే 
దర్వాజా కిటికీల దండి అలంకరణ  
లెక్కల్లో కూడా పక్కాగా పాటించు 
సంప్రదాయమై హైందవమున ... 

అందమైన పొందికే ఇంటికి 
చూపుల బాణాలకు చూడ ముచ్చటై 
లోపలి మనషుల ఆనందాలకు 
లోతైన భావాలకు దర్పణంగా  .... 
 
ప్రాణాధారాల భానుని పసిడి కిరణం 
ఆరోగ్యాల ముచ్చట్లకు ఆనవాలై 
వెండి వెలుగుల పూదోటకు కటకమై 
ఇంటిల్లిపాదికి ఆరోగ్యాలను పంచు ... 

ప్రాణవాయువులకు పట్టుకొమ్మగా 
భీష్మ గ్రీష్మాలలో భీకర గంభీరాల 
భీతిల్లే ఎండ వేడికి తట్టుకోలేకపోతే 
చల్లని సమీరాలకు సన్నని గవాక్షం .... 

పొరుగులతో పొసగజేయుచు 
సంబంధ బాంధవ్యాల
సరాగ సల్లాపాల  ఓలలాడించి 
సంఘ జీవనంలో సంజీవనియై నిలుచు ... 

కిటికీనే కదా అనుకుంటాం కానీ ... 
నిజ జీవన గమనాల నిర్దేశిక 
సుఖ సౌకర్యాల జీవన సుందరం ... 
మనుష్య బంధాల మానస ప్రామాణిక ... 

No comments:

Post a Comment