Monday, March 6, 2023

ఎవరివో తేది : 10-10-2022 శీర్షిక : మాధవ రూపం

 ఎవరివో 

తేది : 10-10-2022
శీర్షిక : మాధవ రూపం 
కవిత సంఖ్య : 

ఆటపాటల బాల్యపు 
బంధాలను తప్పించుకోగానే 
బుద్దినెరిగిన సిద్దహస్తునిగా 
ముద్దుముద్దుగా దరిచేరావు .... 

సంశయాల నీలినీడలలో 
తచ్చాడుతుంటే ... తమ పర 
భేదమెరుగక ప్రశ్నిస్తుంటావు ... 
యోగక్షేమాల కారణభూతవై 
కంటికి రెప్పలా కాచుకుంటావు .... 

మంచి చెడుల మధ్యన కమ్మరి 
కొలిమిలోని కర్రులా నలిగి 
పోతుంటే ... మర్మమెరిగి ధర్మం 
బోధించి ... దన్నుగా నిలబడతావు ... 

కోపతాపాలలో కొంచెం గట్టు దాటి 
ప్రవర్తిస్తున్నానని గ్రహించినా  ... 
మొట్టికాయలేసి గట్టు తెగకుండా 
గట్టి ప్రయత్నమే చేసి... నిలువరిస్తావు ... 

బుద్ధినేర్చిన క్షణం నుండి 
ఆప్త మిత్రునిలా వెన్నంటి నిలిచి... 
మంచి చెడులు నిష్కర్షగా బోధిస్తూ ... 
మాధవరూపం లోనున్న మనసువే కదా .... 

No comments:

Post a Comment