1.పథకం ప్రకారం
జరిగిన ఎన్నికలతో
పతాకం స్వేచ్ఛగా...
ఎగిరింది!
2.సంబరాలకు
ప్రజా స్వాతంత్ర్యం
సంస్కరించుకోండంటే
దేశద్రోహం…
3. రామనవమికి
సెలవు తీసుకుని…
రామ జన్మకు
సాక్ష్యమడుగుతాం…
4. భగవద్గీతనే
ప్రమాణ పత్రం…
జన్మస్థలానికేమో
పంచాయతీ …
5. వేదపురాణాలు
హిమ శిఖరాలు
విద్యలోన
ఆనవాళ్ళుండవు…
6. మనింట్లోకి
పరాయిలొద్దు
దేశంలో దొంగలు
పడితే నాకేంటి….
7. ఎన్నికలకు
ఓటరు కావాలి
మన్నికకు
తాగుబోతు చేయాలి.
8. వందలేండ్ల తెల్ల
పాలకులకు పాస్పోర్టులు…
దశాబ్దాల దత్తపుత్రులకు
దర్జా ఆధార్లు….
9. పరోక్ష ప్రత్యేకలతో
పావురాలు చూపొచ్చు
ప్రశ్నంచినవారు
పరాయిలైపోతారు.
10. కన్నవారికంటే
కట్టుకున్నోళ్ళకంటే
కంచెమీదనే పంచప్రాణాలు…
సైనికుడికి…
No comments:
Post a Comment