Tuesday, March 7, 2023

స్నేహ పుష్పాలు తేది :20-10-2022 శీర్షిక : పసిడి కాంతులు

 స్నేహ పుష్పాలు

తేది :20-10-2022
శీర్షిక :   పసిడి కాంతులు 
కవిత సంఖ్య : సహస్రాధికం 

మనుసులు కలిసి మొగ్గ 
తొడిగిందంటే ... మమతల
పుష్పం విచ్చుకుని అనురాగాల 
తీగలు అల్లుకుంటుంది ... 

కుల గోత్రాల కూడికలుండవు 
ఆస్తి అంతస్తులు అడ్డు రావు...  
పొట్టి పొడుగుల చూసి పొసగదు
పలకరింపులతోనే పసిడి కాంతులు ...  

కపటమెరుగని కమ్మని మోము 
కనినంతనే కనులు విప్పారు...  
ముడుచుకున్న ముఖారవిందం
మురిపంతో  గంతులేయు .... 

కలి మాయల అల్లుకున్న 
కష్టాలన్నీ మాయం చేయును .... 
అడగక ముందే అందించు 
నేనున్నానే భరోసా హస్తం...  

చెప్పుకోలేని గుండెబరుఫు 
చెంపలపై జాలువారు ... 
కాలం తెలియని కబుర్లలో 
కలిసిన మనసు మునిగి 
ఈదులాడుతుంది...  

సృజన సుందరాలను 
అందించి ... ఒకరి గమ్యానికి 
మరొకరు గమనం జోడిస్తూ 
తీరం చేరుకునే బాటసారులు ...  

No comments:

Post a Comment