అమ్మ చేతి చలవ
తేది: 21-10-2022
శీర్షిక : వజ్రకవచ ధీమా
కవిత సంఖ్య: సహస్రాధికం.
ఆరుచికే కదా పరంధాముడు
సైతం పరవశించి అమృత
సమమైన అమ్మ చేతి చలవకే
యశోదమ్మ ఇంట తచ్చాడింది...
భూమి మీద పడీ పడగానే
వజ్రకవచ ధీమాలను కలగజేస్తుంది ...
చిన్నపాటి సుస్తీ పలకరించినా
ఛూ మంత్రంలా పని చేస్తుంది ....
చిన్ని చిన్ని బాల్యంలో ...
మాటల తోటలో విహరించలేని
వయసులో... మన ఆకలి దప్పుల
అలారం అంతా అమ్మ చేతి చలవే ...
పెరిగి పెద్దయినా సరే ...
అలుపు సొలుపుల్లో... ఆటల
బాటలలోనైనా.. ఒక్కసారి "అమ్మ"
అంటూ నిట్టూర్చితినే...ఆయాసమైనా ...
తగిలిన గాయానిమైనా... అమ్మ చేతి
చలవ ఔషధ లేపనమై
అమృతమయమౌతుంది ....
తల్లడిల్లే తనువైనా ...
తండ్లాడే హృదయమైనా...
ఆనందాల కోవెలయిపోతుంది
అమ్మ ఒడిలో తలవాల్చగనే...
సమాధానాలు కరువైన కోటి
ప్రశ్నలు నిండిన మానసమైనా ...
అమ్మను తలుచుకుంటే చాలు
గుండె కుదుటపడే కుందనమే ...
No comments:
Post a Comment