విజయదశమి
తేది : 05-10-22
శీర్షిక : దసరా పండగ
కవిత సంఖ్య : సహస్రాధికం
అలవికాని ఆశలకు మనసు
అంకురమైనప్పుడు... బుద్ది
చెప్పే సుద్దులు వినకుంటే
సద్దు మనుగు...అజమాయిషీతో ...
దైత్య వంశజుడు మహిషాసురుడు
మరణం లేని జీవనమంటూ
విధికెదురేగి వింత కోరికలను
విధాతచే అనుగ్రహింపబడి
అల్లకల్లోలాను సృష్టిస్తుంటే .. .
వరగర్వితుడై ఇంద్రపదవి
చేపట్టగా ... ముక్కోటి దేవతలు
ఒక్కటై త్రిమూర్తులకు మొరపెట్ట
శక్తులన్నీ ధారబోసే సింహవాహిని కి ....
తొమ్మిది రోజులు అహోరాత్రులు
పోరాడి ... పదవ రోజు విజయమందే .
ఆ రోజే విజయ దశమిగా సంప్రదాయమై
సన్నుతించబడె ...సర్వజనులచే...దసరాగా
No comments:
Post a Comment