భయం... అభయం
తేదీ : 18-10-22
శీర్షిక : ధర్మాధర్మములు
కవిత సంఖ్య : సహస్రాధికం
అధర్మం నీ అస్థిత్వమైతే
అన్యాయం నీ పడగైతే
అవినీతి నీ చిరునామైతే
అనుక్షణం వెన్నంటేది .. భయం..
చీకటిలో చిట్టెలుకైనా
కాళరాత్రిలో కాలుకింద తాడైనా
అనుమానం పెనుభూతమైనా
ఆక్రమించు మనసంతా .. భయం
కరోనా కాలంలో సాక్ష్యమే
క్రిమికారకం ఎంతో కొంతైతే
భయం కారణం భయానకమై
పామోలే పట్టక ముట్టక
తల్లికి తండ్రికి దూరమైన చావులు ....
ఆత్మసాక్షికి అనుకూలంగా
ధర్మం నీతి నియమం న్యాయం
అభయానికి అధిదేవతలు
అవిపాటిస్తే కలుగును అభయం...
మానవతకు మచ్చుతునకై
ఆత్మీయతలకు మారుపేరై
మంచిని నీవు ఎంచుకుని
అభయం పొదువుకుని
ధైర్యాన్ని జోడించుకుంటే
విజయం నీ చెంత చేరదా ..
No comments:
Post a Comment