స్వేచ్ఛ గజల్
తేది : 01-10-2022
పల్లెపట్టు పడుచుజంట
పసందులే ఎడ్లబండి
కఱ్ఱతోని ఇల్లుబోలు
ప్రశంసలే ఎడ్లబండి
హితమైనా రవాణమే
గతంలోన నాగరికత
అనుబంధం తోరణమే
చిక్కములే ఎడ్లబండి
సంసారపు నావలాగ
ద్విచక్రముల వాహనమూ
ఇరుసులాయె ఇగురముగా
కేంద్రములే ఎడ్లబండి
యాత్రకైన జాత్రకైన
రెండెద్దులు తోడుంటే
సుందరాన మనిషికిని
పయనములే ఎడ్లబండి
రారాజుగ రైతైనను
కానీయరు ఎప్పుడైన
మాటలలో గారడీగ
భలేభలే ఎడ్లబండి
No comments:
Post a Comment