Monday, March 6, 2023

కణిక చిత్రకవిత 2 16-10-2022 ఎవరో వస్తారని

 కణిక  చిత్రకవిత 2

16-10-2022    


ఎవరో వస్తారని 
ఎదురు చూడకు 
ఎవరూ రాలేదని 
నిరాశ పడకు .... 

అద్దం ఎప్పుడు 
చెప్పదు  అబద్దం 
బింబంగా నిలబడితే 
ప్రతిబింబమై పలకరిస్తుంది ... 

నీపై నీకే నమ్మకంతో  
కదలాలి ముందుకు... 
ఆపై ఉండనే ఉన్నది 
ఆత్మస్థైర్యం .... 
 
పద పద కదులు 
ముందుకు...  
కదంలోన కలతల 
చింతెందుకు...  

లక్ష్యమే లక్ష్యంగా 
లక్షణంగా కదులు నీవు 
ప్రణాళికతో పరుగు పెట్టు.. 
ఫలితాలను సాధించి పెట్టు ...  

నీకు నువ్వే సాటిరా 
పోటీ లేరు నీకెవరురా 
వెదకకు వేరెవరినీ 
వెన్నుతట్టి నిన్నునిలుప  

వదిలిపెట్టు ఆత్మన్యూనత 
కదిలి పట్టు ఆత్మస్థైర్యం 
గగనమైనా భీతిల్లకూ 
గాంభీర్యం వదిలిపెట్టకూ 

అందరెరిగిన సత్యమది 
ప్రపంచమెపుడు పరుగెత్తు 
నీవెరిగిన నిజవిజ్ఞానం 
చాతుర్యంతో నిలబెట్టు 

పొరుగు రుచులు పొగడమాకు 
విరుగు ధైర్యం వింతగాను 
పాతుకున్న భావాలను 
పీకివెయ్యి కూకటేళ్లతో ... 

సాగదీయకు సందిగ్ధంగా 
అడుగువేయి ఆనందంగా 
పొదివి పట్టు విజయాన్ని 
విశ్వగీతిక నీకు నీవై .... 

No comments:

Post a Comment