Tuesday, March 7, 2023

మినీ కవిత - నీ ఊహలలో తేది : 21-10-2022 శీర్షిక : మాతృదేవోభవ

  మినీ కవిత - 

నీ ఊహలలో 
తేది : 21-10-2022
శీర్షిక : మాతృదేవోభవ 

ఊహలలో సదా నీ రూపం 
ఊసులతో నిలుచు ఆనందం 
ఊయలవు మానసం నీ తలపుల 
అనుక్షణం నీ స్మరణలే ధైర్యం .. 

వెన్నంటిన ప్రేమానురాగాలు 
వేయి జన్మలైనా మననమే 
రెప్ప మూయగానే తెప్పలా 
స్వప్నమయ్యే మాతృదేవోభవ ...!

No comments:

Post a Comment