Monday, March 6, 2023

ముఖవర్చస్సు శీర్షిక : ఆత్మ సౌందర్యం

 ముఖవర్చస్సు

శీర్షిక : ఆత్మ సౌందర్యం 
కవిత సంఖ్య : 

విప్పారిన విరి కమలమో 
వింతైన కనుముక్కుతీరో 
కనుల కాంచే కమనీయమోనని 
భావించుకొనుట బ్రాంతియే ... 

కపటము కానరాని దీవిలా 
నిర్మల నీరజ నేత్రమై 
హంసల దీవంటి హృదయతటాకంతో  
చేయందించే చిరునవ్వుల మందహాసం... 

శుచి శుభ్రతల ప్రతినిధిగా 
మానవతలకు మచ్చుతునకగా 
ఆత్మీయతలకు ఆనవాలుగా 
నడవడికలకు నవ చిరునామాగా 
పలకరించే కలుపుగోలు తనం .... 

నాగరికతల నడకలలో 
పట్టణీకరణ జాడలలో 
మర్కట నీడల మతలబులతో  
కొంత అసంబద్ధమై వ్యవహరించింది ... 

పై పై మెరుగుల పటాటోపం 
మేడిపండును తలపించునేమో...కానీ 
అసలు సిసలైనది అంతుచిక్కాలంటే 
ఆత్మసౌందర్యమనే గ్రహించాలి .... 

No comments:

Post a Comment