ఊపిరి
శీర్షిక : మానవ కళ్యాణం
తేది 28-10-2022
అనావృష్టితో అలమటించినా
అతివృష్టితో చేతికందొచ్చిన
పంట మట్టి కొట్టుకుపోయినా ....
పదే పదే పలువిధాల ప్రకృతి
కన్నెర్రజేసినా ... పాలకుల చేతిలో
పావులుగా మారినా .... ఆశావాదిగా
రుధిరం స్వేదం చేసుకుని... అందరి
కడుపులు నింపే హాలికుడికి
ఊపిరి సకల జనుల సంక్షేమం ....
కనిపెంచిన తల్లితండ్రులను ...
కట్టుకున్న జీవిత భాగస్వామిని ....
కన్న పిల్లలను కాలానికి వదిలినా ...
దేశ క్షేమమే ఊపిరి సైనికుడికి ....
No comments:
Post a Comment