Tuesday, March 7, 2023

వార్ధక్యం / వృద్దులపై గేయాలు తేది : 22-10-2022 శీర్షిక : పవిత్రమైన దివ్య సందోహం

 వార్ధక్యం / వృద్దులపై గేయాలు

తేది : 22-10-2022
శీర్షిక : పవిత్రమైన దివ్య సందోహం 
కవిత సంఖ్య : సహస్రాధికం 

ముందు వెనకల శుభ గమనం 
అందరు చేరే శిఖర గమ్యం... 
పవిత్రమైన దివ్య సందోహం 
పండు ముదుసలి ప్రమోదం 

వెండి జలతారుల కేశం 
షష్టిపూర్తుల సమారోహం
నిండు పూదోటల అనుభవం
పెదాలు పలకని మౌనం 
సదా కోరును సంక్షేమం  .... 

చూపులు ఆనని నయనం 
అయినా వీడని తాపత్రయం 
డైమండ్ జుబిలీ వసంతం 
మాట వినలేని శ్రవణం
ఆరాటాల భావస్ఫోరకం  

ముందు వెనకల గమనం 
అందరు చేరే ఆ గమ్యం...

ముడుచుకున్నశరీర సౌధం   
ముచ్చట గొలుపు పెద్దతనం 
సహస్ర చంద్ర దర్శన భాగ్యం 
సద్దుమణగని సుద్దుల మానసం 
వణుకుతున్న ప్రతిఅంగం 
వంకవీడని  శుభారంభం .... 

కాలు కదలదు 
చేయి నిలవదు 
ఆగిపోదు తపనల పోరాటం 
పరిచయమగు ప్రతివారికి 
ఈ భవిష్య వాణి దొంతరం ... 
   
ముందు వెనకల గమనం 
అందరు చేరే ఆ గమ్యం...

పెట్టకూడదు మనం దూరం 
పెద్దవారికి పెనుప్రమాదం 
చేరువై నిలువు ఓ క్షణం .... 
చెంత నిలిచి పలుకు ఒక్క పదం  

వద్దంటున్నా వృద్ధాశ్రమం
కాదంటున్నా సంప్రదాయం 
వృద్ధులెప్పుడు పూజనీయం 
సద్దుచేయక మనం సర్దుకుందాం ...  

ముందు వెనకల శుభ గమనం 
అందరు చేరే శిఖర గమ్యం... 
పవిత్రమైన దివ్య సందోహం 
పండు ముదుసలి ప్రమోదం 

No comments:

Post a Comment